Friday, February 17, 2012

సాయి బాబా ఉద్యమము

సాయి బాబా ఉద్యమము 



ఓం సాయి మాస్టర్ 
పుణ్య ప్రదమ్ - సమాజ హితం 
గ్రంధ దాన దీక్ష - 366 పుస్తకములతో సంవత్సర దీక్ష 

సాయి బంధు ! 
ప్రేమ పూర్వక నమస్కారములు..
ఈ సూచన తో పాటు జత పరిచిన సాయి బాబా ఉద్యమము కరపత్రము కూడా చదవండి..మనకు సమాజమునకు మేలు కలిగించే సాయి మరియు ఇతర దత్త మూర్తుల చరిత్ర పుస్తకాలు సర్వ మానవాళికి అందించాలనే ప్రయత్నములో ..ఒక ప్రత్యేక కార్యక్రమము ప్రారంభించాను...సాయి భక్తులు ఉత్సాహముగా సహకరిస్తున్నారు.
మీకు కూడా ఆ కార్యక్రమము గురించి వివరించి ప్రోత్శ్చహించాలని మీరు అలా చేయాలనే ఉద్దేశ్యం తో ఈ సూచన చేస్తున్నాను ..
శిరిడి సాయి బాబా మహాసమాధి చెంది 100 సంవత్సరములు పూర్తి అయి 101 వ సంవత్సరము నడుస్తూంది....ఈ సందర్భమును పురస్కరించుకుని సాయి భక్తి ప్రచారకులు 
అందరూ కూడా..తమకు తోచిన రీతిన ప్రత్యేక కార్యక్రమములు చేస్తున్నారు...
నేను కూడా ఒక కార్యక్రమము చేపట్టాను ...
నా ఉద్దేశ్యము ఏమిటి అంటే మనకు వ్యక్తిగతము గాను సమాజములో గొప్ప మార్పు మంచివైపుకు తీసుకు వెళ్ళేది గాను ఉండే ఒక కార్యక్రమము ప్రారంభించి కొనసాగించాలని అనుకున్నాను..నేను మొదటినుంచి అనుభవ పూర్వకముగా తెలుసుకున్నది ఏమిటి అంటే సాయి చరిత్ర మరియు దత్తావతారముల చరిత్రల పఠన వల్ల మానవులలో సద్గుణాలు నెలకొంటాయి అని ..అలా సద్గుణవంతుడైన మానవుడు సమాజనికి హాని కలిగించకుండా ఉంటాడు అనీ చేతనైతే మేలు చేస్తాడు అని తెలుసుకున్నాను ...అందుకే సాయి మహాసమాధి పూర్తి అయి 100 సంవత్సరములు అయిన సందర్భముగా నేను తీసుకున్న ప్రత్యేక కార్యక్రమము ఎక్కువగా గ్రంధ దానము చేయటము చేసేలా భక్తులను ప్రోత్సహించటము ....
అదే 366 పుస్తకాలు పంచే దీక్ష ...ఏదైనా ఒక శుభ సందర్భములో మొదలుపెట్టి ఒకసంవత్సరములో 366 చరిత్ర పుస్తకాలు పంచటము..ఉగాది, శ్రీరామనవమి, గురుపూర్ణిమ, సాయి మహాసాధి విజయదశమి, దత్తజయంతి ,,లేకపోతే పుట్టిన రోజులు పెండ్లి రోజులు ఇలా ఏదైనా ప్రత్యేక సందర్భములో మొదలు పెట్టి ఒకసంవత్సరము పూర్తి అయేటప్పటికి 366 పుస్తకాలు పాంచాలి...
అందుకు వెసులు బాటుగా ఉండేందుకు నేను నేను ప్రచురించిన చిన్న పుస్తకాలు
 (1) శ్రీ సాయి బాబా చరిత్ర 
(2) శ్రీ గురు చరిత్ర కధా సార 
ఈ .పుస్తకాలు అందుబాటులో ఉంచు తున్నాను..
366 పుస్తక ములు తెప్పించుకోవటానికి ఎంత అవుతుంది అంటే ...
పుస్తకము ఒక్కటి రూ . 30..ఐతే 366 పుస్తకాలు  రూ .10980 అవుతాయి ..
ఐతే 366 పుస్తకాలు తీసుకున్న వారికి నేను 100 పుస్తకాలు ఉచితముగా ఇస్తాను ...
అంటే 266 పుస్తకాలకు చెల్లిస్తే చాలు 366 పుస్తకాలు పంపుతాను..266 పుస్తకాలకు రూ . 7,980 అవుతాయి.  3000 వేల రూపాయలు తగ్గుతాయి.   నేను పుస్తకాలకు 30 రూపాయలు ధర పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది.  ఈ పది ఏళ్లలో ధరలు ఎన్నో రేట్లు పెరిగాయి అయినా నేను పుస్తకం ధర పెంచలేదు ఇక ముందు కూడా పెంచ దల్చుకోలేదు.. 
30 రూ గానే ఉంచుతాను...గ్రంధ దానము ప్రోత్సహించటానికి 100 పుస్తకాలు నా వంతుగా ఇస్తున్నాను ....
మరొక విషయము ఏమిటి అంటే ...తెలిసిన వాళ్ళకు అందరికీ ఇదివరకే పుస్తకాలు ఇచ్చాము ...ఆసక్తి గల వారికే ఇస్తున్నాము అని ఇందులోని ప్రయోజనము లోతుగా ఆలోచించని వారు చెపుతున్నారు ...ఈ కార్యక్రమములో ...అందరి ఇళ్లలోనూ తప్పనిసరిగా సాయి చరిత్ర లేక దత్త మూర్తుల చరిత్రలు ప్రవేశపెట్టి సమాజమునకు హితము చేయాలి అని ....అందుకని బయటికి వెళ్ళేటపుడు 2 లేక 3 పుస్తకాలు తీసుకు వెళ్ళి తెలిసిన వాళ్ళు అయిన తెలియని వాళ్ళు అయినా ఈ పుస్తకము మీదగ్గర ఉంచండి అని ఇస్తూ ఉండాలి ..ఒకవేళ వారు తీసుకోకపోతే మనము ఏమి అనుకోకూడదు మరొకరికి ఇవ్వ ప్రయత్నించాలి ...తీసుకున్నవారు పుస్తకము తీసుకున్నవారు ఆపుస్తకము వాళ్ళ ఇంట్లో పెడతారు ..ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఆ పుస్త్కము చేతికి తీసుకుంటారు ...చదువుతారు ...మంచి వారు అవుతారు.. మంచివారు మరికొంత దైవం వైపుకు పరిణామము చెందుతారు ....
అందువల్ల మేకు నా విజ్ఞప్తి ఏమిటి అంటే మీరు కూడా ఈ 366 పుస్తకాల దీక్ష చేపట్టండి .
ఇందుకు గాను ప్రతిరోజూ రూ . 22 ...బాబా వద్ద గ్రంధ దానము కోశము ఉంచితే సంవత్సరానికి 366 క్ష 22 =  8,052 రూపాయలు అవుతాయి ..366 పుస్తకాలు తెప్పించుకోవటానికి సరిపోతాయి.. 
ఎన్నో ఖర్చులు పెడుతున్నాము ..ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాము ..దీని గురించి కూడా కొంచెం ఆలోచించండి ....ఇతర దాన ధర్మాల కంటే కూడా గ్రంధ దానము అనేక విధములుగా మనకు సమాజానికి కూడా మేలు తప్పకుండా చేస్తుంది....
మీరు తప్పకుండా 366 పుస్తకాల దాన దీక్ష చేపట్టండి....
సాయి స్మరణలో 
మన్నవ సత్యం 
BLOG : :  http://msswindows.blogspot.com/ 

YouTube :: https://goo.gl/m6vGwk

facebook ::  https://www.facebook.com/mannavasatyammannava

Twitter ::     https://twitter.com/mannava_satyam

My WhatsApp :: +918121225719    :  for whatsapp Only  



Followers